ఆంధ్రప్రదేశ్‌

ఇదేం వైఖరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17:రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్లో ఎవరికి అంటువ్యాధులు సోకినా, ఇంట్లో వారికి సోకినట్టే భావించి రంగంలోకి దిగాలని, ఉదాసీన వైఖరిని విడనాడాలని ఆయన హితబోధ చేశారు. సీజనల్‌గా వచ్చే డెంగ్యూ, మలేరియా, అతిసార తదితర అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు, ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే సకాలంలో నివారించేందుకు అవసరమైన చర్యలు యుద్ధప్రతిపదికన చేపట్టాలని ఆదేశించారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన శాఖల మంత్రులు కామినేని శ్రీనివాస్, పి నారాయణలతోపాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురంలో ఇద్దరు చిన్నారులు డెంగ్యూ సోకి మరణించిన సంఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రంలో వివిధ సీజనల్ వ్యాధులను సకాలంలో గుర్తించి పూర్తిగా నివారించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వర్షాకాలంలో నీరు, దోమలు, అపరిశుభ్రత వంటి కారణాలతో ప్రబలుతున్న డెంగ్యు, చికున్‌గున్యా, మలేరియా, అతిసార వ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా గ్రామాల్లోను, ప్రాంతాల్లోను విస్తృతంగా పర్యటించి వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించాలన్నారు. గ్రామాల్లోను, పట్టణాల్లోను డ్రైన్లలో ఎక్కడ నీరు నిలువలేకుండా తగు చర్యలు తీసుకోవడంతోపాటు బ్లిచింగ్ చల్లడం, దోమల నివారణను ఫాగింగ్ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డిజిపి నండూరి సాంబశివరావు, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలనా శాఖల ముఖ్య కార్యదర్శులు పూనం మాలకొండయ్య, కెఎస్ జవహర్‌రెడ్డి, కరికాల వల్లవన్, కమాండ్ కంట్రోల్ అధికారి బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ డాక్టర్లపై చర్యలు తప్పవు: కామినేని
డెంగ్యూ వ్యాధి పేరుతో ప్రజలను భయాందోళనలకు గురి చేసి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ డాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. లేని వ్యాధి లక్షణాలను ఆపాదించి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న శ్రీకాకుళం జిల్లా పలాసలోని రాజేశ్వరి నర్సింగ్ హోంకు నోటీసులు ఇస్తున్నామని, అవసరమైతే ఇటువంటి ఆసుపత్రుల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.