ఆంధ్రప్రదేశ్‌

కన్నులపండువగా జగన్నాథ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 11: అనంతపురం నగరంలో శనివారం జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో ఇస్కాన్ దక్షిణ భారత ఇన్‌చార్జి శ్రీ సత్యగోపీనాథ్‌దాస్ స్వామీజీ, మంత్రాలయం రాఘవేంద్రస్వామి పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు, ఎస్పీ రాజశేఖరబాబు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతోనే ఆనందమయ జీవనం

రాజ్యసభ సభ్యుడు టిఎస్సార్

విశాఖపట్నం(జగదాంబ), ఫిబ్రవరి 11: ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని రాజ్యసభ సభ్యుడు, టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విశాఖలోని ఏయూ అసెంబ్లీహాలులో శనివారం టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం, వెలువోలు ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర ప్రతిభా పురస్కార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీఎస్సార్ మాట్లాడారు. విశాఖ ప్రజలంటే తనకు అభిమానం అని, వారి కోసం తుదిశ్వాస వరకు సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. తెలుగుభాష శక్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన మహోన్నతవ్యక్తి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అని కొనియాడారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లో ప్రఖ్యాత, విశాఖ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్ళిన ప్రతిభావంతులైన పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఘనంగా సత్కరించి కంకణాభరణం తొడిగారు. అలాగే ఏయూ తెలుగు ప్రాచ్యభాషల అధ్యాపకవర్గం అధ్యక్షుడు ఆచార్య ఎం.జయదేవ్, రాజస్థానీ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు చాంద్‌మాల్ అగర్వాల్, ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు డాక్టర్ బిఎస్ రెడ్డి, ఏయూ మాజీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ జిఎస్‌ఎన్ రాజు, వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ ఎన్.లక్ష్మీ, హిందూ దినపత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ సివి సుబ్రహ్మణ్యం, పౌరాణిక నాటకబ్రహ్మ బివిఏ నాయుడు, హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ డి.రఘునాథరావు, సకల నాట్య కళాకారుడు కురిటి సత్యంనాయుడులకు ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఎమ్మెల్సీ, గీతం అధ్యక్షుడు ఎంవివిఎస్ మూర్తి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, వెలువోలుట్రస్టు కన్వీనర్ బసవపున్నయ్య, ఏయు వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నృత్యరూపకం భగీరథ విలాసం ప్రేక్షకులను ఆకర్షించింది.