క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, సెప్టెంబర్ 7 : మున్సిపాలిటి పరిధిలోని గుత్తి ఆర్‌ఎస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్యాణ్ (25) మృతి చెందాడు. గుత్తి ఆర్‌ఎస్‌లో నివాసం ఉంటున్న కల్యాణ్ చెట్నెపల్లిలో స్నేహితుల వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి బోల్తాపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అదనపు వైద్యసేవల కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.