క్రైమ్/లీగల్

హెచ్చార్సీ కేసులు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని నివారించే ప్రక్రీయలో ముందు జాగ్రత్త చర్యగా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు రోజువారి ఫిర్యాదు కేసుల విచారణ వాయిదా వేసింది. కేవలం ఫిర్యాదులు తీసుకుంటామని, మార్చి 20 నాటికి విచారణ చేసిన ఫిర్యాదులు అన్ని జూన్ 19వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. అత్యవసర ఫిర్యాదులు వారానికి రెండు సార్లు మంగళ, గురువారాల్లో కోర్టులో విచారణ జరుగుతుంది. ఎవరిని లోపలికి అనుమతించకుండా గేటుకు తాళం వేసి సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు హెచ్చార్సీ చైర్మన్ జస్టీస్ జీ.చంద్రయ్య ఆదేశాలు జారీ చేశారు.