ఆంధ్రప్రదేశ్‌

అనంతపురం జిల్లాకు రూ. 6.5 వేల కోట్ల ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆశయం పేరుతో జిల్లాకు 6,554 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ జిల్లాపై దివంగత నేత ఎన్టీఆర్‌కు ఎంతో ప్రేమ ఉండేదన్నారు. ఈ కారణంగానే వ్యవసాయం, తాగునీరు, ఇరిగేషన్, విద్య, వైద్యం, రహదారులు, రవాణా తదితర రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసేందుకు భారీ ప్యాకేజీని అమలు చేస్తామన్నారు.