రాష్ట్రీయం

వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా టోకెన్ కౌంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 31: తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ప్రత్యేకంగా టోకెన్ కౌంటర్లను బుధవారం టిటిడి ప్రారంభించింది. టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు ఈ కౌంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ రోజుకు రెండు స్లాట్లలో దాదాపు 1500 మంది వృద్ధులు, వికలాంగులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని నివారించి మరింత మెరుగైన దర్శనం కల్పించేందుకు టోకెన్ కౌంటర్లు ప్రారంభించామని తెలిపారు. మధ్యాహ్నం స్లాట్‌కు కూడా ఉదయమే టోకెన్లు మంజూరు చేస్తామని, దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని వివరించారు. దక్షిణ మాడ వీధిలో గల వృద్ధులు, వికలాంగులు వేచి ఉండే హాలులో ఇటీవల పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అక్కడ సీట్ల సామర్థ్యాన్ని పెంచామని జెఇఓ తెలిపారు.

ప్రపంచ పర్యాటక కేంద్రంగా అహోబిలం
కేంద్ర మంత్రి అనంత కుమార్
ఆళ్లగడ్డ, మే 31: వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం క్షేత్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం క్షేత్రాన్ని ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. అనంతరం మాలోల అతిధి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ అహోబిల శ్రీ లక్ష్మీనరసింహస్వామి తమ ఇలవేల్పు అన్నారు. ఈరోజు స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నల్లమలలో నవనారసింహ క్షేత్రాలు వుండడం విశేషమన్నారు. ఎంతో ఆహ్లాదకర వాతావరణం కలిగివుండడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం, అహోబిలం, తిరుమలను ఒకే సారి భక్తులు దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటక శాఖ మంత్రి మహేష్‌శర్మ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి పర్యాటక కేంద్రంగా అహోబిలంను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కలెక్టర్ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 25 కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తారన్నారు. వీటిలో ఒకటి అహోబిలంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు బిపి, షుగర్, కిడ్నీలు తదితర వ్యాధుల నివారణకు 30 శాతం సబ్సిడీతో మందులు సరఫరా చేస్తారని తెలిపారు. రాష్ట్రానికి 1.50 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. అంతకుముందు మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అహోబిలంలో కేంద్రమంత్రి అనంతకుమార్ దంపతులకు
స్వామివారి చిత్రపటం అందచేస్తున్న కలెక్టర్ సత్యనారాయణ