రాష్ట్రీయం

గల్ఫ్ వెళ్లే మహిళలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిక్రూటింగ్ ఏజెన్సీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మైగ్రేషన్ విధానానికి మార్పులు చేర్పులు
కసరత్తు చేస్తున్న కేంద్రం
అదే బాటలో ఏపి ముందడుగు
హైదరాబాద్, డిసెంబర్ 6: గల్ఫ్ దేశాల్లో పని చేసేందుకు వెళ్లే మహిళలు మోసాలబారిన పడకుండా కేంద్రప్రభుత్వం మైగ్రేషన్ విధానాన్ని నియంత్రించేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా రాష్ట్రప్రభుత్వాల సహకారంతో గల్ఫ్ వెళ్లే మహిళల కోసం పటిష్టమైన విధానాన్ని అమలు చేస్తోంది. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ‘ఓవర్‌సీస్ మాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్’ (ఓఎంసిఏపి) ద్వారా గల్ఫ్ దేశాల్లో ఇళ్లలో పని చేసేందుకు వెళ్లే మహిళలకు అవసరమైన కొంత శిక్షణను ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం సలహా మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఓఎంసిఏపి ఈ శిక్షణను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి), యుఎన్ ఉమెన్ సహకారంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. విజయవాడలోని కొందరు నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని ఓఎంసిఎపి జనరల్ మేనేజర్ కెవి స్వామి తెలిపారు. గల్ఫ్‌లో ఇళ్లలో పని చేసేందుకు వెళ్లేవారు, ఇతర నైపుణ్య, నైపుణ్యేతర ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి గత కొనే్నళ్లగా పెరుగుతోంది. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఓమన్ దేశాలకు అధికంగా భారత దేశంలోని పలు రాష్ట్రాల నుంచి మహిళలు ఉపాధికోసం, ముఖ్యంగా ఇళ్లల్లో పనికోసం వెళుతున్నారు. మిగిలిన వారు కాస్త మెరుగైన పనులకోసం వెళుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా విదేశాల్లో ఉపాధి కోసం పంపిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, దిల్లీ రాష్ట్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇక్కడినుంచి మూడు కేటగిరీలుగా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళుతున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు, అక్కౌంటెంట్లు, మేనేజర్లు ఒక కేటగిరి అయితే మరో కేటగిరిలో సెమి స్కిల్డ్ పనివారైన క్రాఫ్ట్స్‌మెన్, డ్రైవర్లు, కళాకారులు ఉండగా, కేటగిరిలో సాంకేతిక, సాంకేతికేతర పనివారు మూడో కేటగిరీలోకి వస్తారు. వీరు వ్యవసాయ భూములు, పశువుల కొట్టం, దుకాణాలు, మాల్స్‌లో, ఇళ్లలో పని చేస్తుంటారు. ఇలా ఉపాధి కోసం అధికంగా వెళుతుండడం, అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోవడం వంటివి తరచు జరుగుతున్నందున ఇక నుంచి వీరిని పంపించే ఏజెంట్ల పాత్రపైనా నియంత్రణ సాధించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లోని మాన్ పవర్ రిక్రూటింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. అటువంటి ఏజెన్సీలే ఉపాధి కోసం వెళ్లే వారిని పంపించాలి. విదేశాలకు వెళ్లాక అక్కడ ఉద్యోగం లేకపోయినా, జీతం సరిగ్గా ఇవ్వకపోయినా, కాంట్రాక్ట్ ఉల్లంఘించినా ఆ ఏజెన్సీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారికి ఇమ్మిగ్రేషన్ పరంగా తలెత్తే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆ దేశాల్లో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన రక్షణ, చట్టాల గురించి కూడా చైతన్యం తీసుకు వచ్చేందుకు ఎపి ప్రభుత్వం శిక్షణ ద్వారా అందించనుంది.