ఆంధ్రప్రదేశ్‌

బాలకృష్ణా.. ఒళ్లు జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన తీరు అత్యంత హేయమని బీజేపీ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌లు ఖండించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో చేస్తున్న దీక్ష సందర్భంగా బాలకృష్ణ ఒక ఉన్మాది మాదిరి ప్రధానిపై విమర్శలు చేయడంపై విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు. దేశ ప్రధానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రేక్షకపాత్ర వహించడం గర్హనీయమన్నారు. చంద్రబాబు చేస్తున్నది ‘అధర్మపోరాట దీక్ష’గా అభివర్ణించారు. పూర్తి అధికార దుర్వినియోగంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించుకోవడం ఆయన సంకుచితతత్వానికి నిదర్శనమన్నారు. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ, మభ్యపెట్టే రీతిలో సాగిన దీక్షను దొంగ దీక్షగా ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మరింత దూకుడుతో ప్రధాని మోదీని చెప్పడానికి వీలుకాని భాషలో దుర్భాషలాడటం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. ప్రధానిపై దాడి చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో బాలకృష్ణ మాట్లాడటంపై పోలీసులు తక్షణమ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామే ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి వంటి సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు. చట్టం నుంచి తప్పించుకునే తెలివితేటలు బాలకృష్ణ సొంతమైతే, తాము చట్టం, న్యాయ పరంగా చర్యలకు ఉద్యమిస్తామన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాని అనివార్య పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రూ.16వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడిందని, దీనిలో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు ద్వారా రూ.9,300 కోట్లు తక్షణ సాయం అందించే అవకాశం ఉందన్నారు. అయితే ఎస్పీవీ ఏర్పాటుకు నిరాకరించిన చంద్రబాబు కేంద్రంపై రాజకీయ స్వలాభం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా నినాదంతో విపక్ష వైసీపీ ఎక్కడ రాజకీయంగా లబ్ధిపొందుతుందోనన్న భయంతోనే చంద్రబాబు కేంద్రంతో హోదా పేరిట పోరుకు సిద్ధపడ్డారని అభిప్రాయపడ్డారు. దీన్ని తాముప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అనంతరం నగరంలోని ఆశీల్‌మెట్ట కూడలి వద్ద సినీనటుడు బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.