ఆంధ్రప్రదేశ్‌

ప్రజల్లోకి కేంద్ర పథకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వివిధ వర్గాల సంక్షేమం, శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ఫలాలు అందేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ సీనియర్ నేత, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, శాసనసభలో ఫ్లోర్‌లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్‌రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పీవీఎన్ మాధవ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ గ్రామస్వరాజ్ కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు.
ప్రధానికి చెక్ పవర్ లేకపోయినా సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించి ఢిల్లీ నుంచి గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు పంపుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరువయ్యేలా చూడాలన్నారు. ఉజ్వల్ పథకం కింద అర్హులందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాలన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా 8వేల ఆసుపత్రులను నిర్మించబోతున్నామని, రైతుల శ్రేయస్సు కోసం స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లు అమలు చేయబోతున్నామని ప్రధాని మోదీ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన కొద్దిసేపు చర్చించారు.

చిత్రం..ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ నేతలు