ఆంధ్రప్రదేశ్‌

అది రాజకీయ అస్తిత్వ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 21: కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం... అధికారులు లేక స్తంభించిన పాలనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష ఆయన రాజకీయ అస్తిత్వం కోసమేనని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. సీనీ నటుడు బాలకృష్ణలో మానసిక పరిపక్వత లోపించిన కారణంగానే ఆయన అదుపు తప్పి మాట్లాడుతున్నారన్నారు. ప్రధానిని ఎమ్మెల్యే బాలకృష్ణ దూషిస్తుంటే అదే వేదికపై ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండటం దారుణమన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రధానిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. బాలకృష్ణ మానసిక స్థితి సరిగాలేదని అభిప్రాయపడిన ఆయన గతంలో కూడా ఆయన అదుపుతప్పి మాట్లాడిన సంఘటనలను గుర్తు చేశారు. ప్రధానిని అవమానించే విధంగా బాలకృష్ణ మాట్లాడుతుంటే సీఎం చంద్రబాబు నవ్వడం చూస్తుంటే బాబు ప్రోత్సాహంతోనే ప్రధానిని దూషించినట్లుగా అర్థమవుతోందన్నారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రజలే తగిన శాస్తి చేస్తారని చెప్పారు. ధర్మపోరాట దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు చేసిన దీక్ష కారణంగా రాష్ట్ర ఖజానాపై 30 కోట్ల అదనపు భారంతో పాటు ఉద్యోగులు లేని కారణంగా పాలన స్తంభించడంతో మరో 200 నుండి 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు కాకుండా, రోజు వారీ కార్యక్రమాలకు భంగం కలగకుండా ప్రధాని చేసిన ఉపవాసదీక్షను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు దీక్ష చేసుకోవాలని ఆయన సూచించారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్ష కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి డ్వాక్రా మహిళలు, కళాశాల విద్యార్థులను తరలించి నాటకీయంగా ఏసీల్లో కూర్చొని దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే నిజాయితీ పరులని, వ్యతిరేకిస్తే పలు రకాలుగా విమర్శించడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకున్నారన్నారు. వ్యక్తులను టార్గెట్ చేసుకుని వారిని అపఖ్యాతిపాలు చేసేందుకు అభూత కల్పనలతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకుని మీడియాకు 10 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులపై తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలపైనా, పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 350 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై నిజనిర్దారణ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మీడియాపై దాడి సరికాదు
కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడటం సరికాదని మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. మీడియా సంస్థలపై, అస్తులపై దాడి సరికాదని అభిప్రాయపడిన ఆయన ఇదే సమయంలో మీడియా కూడా ఒకరి పక్షం వహించకుండా ముందుకు సాగాలన్నారు. స్వయం నియంత్రణ చేసుకుని ముందుకెళ్లాలని ఆయన మీడియా సంస్థల ప్రతినిధులకు సూచించారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాణిక్యాలరావు