ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ వివాదంపై హిందూ సంస్థల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా నియమితులై అన్యమతస్తురాలిగా విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే అనిత తరహాలోనే టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకుంటే ప్రభుత్వమే ఆయన్ను తొలగించాలని హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ డిమాండ్ చేశారు. టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విహెచ్‌పి, ఇస్కాన్ వంటి 20 హిందూ సంస్థల ప్రతినిధులు తిరుపతిలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన తెలిపి, అక్కడ నుంచి అలిపిరి వరకు పాదయాత్రగా వెళ్లారు. పుట్టా నియామకాన్ని 90శాతం మంది హిందువులు వ్యతిరేకిస్తున్నందున అతన్ని తొలగించాలని కోరారు. ప్రభుత్వం సుధాకర్ యాదవ్‌ను తొలగించకుంటే తిరుపతిలో 10వేల మందితో హిందూ గర్జన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. సుదర్శన్ మహాసేన, భజరంగ్‌దళ్, ఇస్కాన్, వీహెచ్‌పీ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.