ఆంధ్రప్రదేశ్‌

నేడు సీఎం వద్ద పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు తెలుగుదేశం అధిష్ఠానానికి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. గతంలో ఇరువర్గాల మధ్య రాజీ ప్రయత్నంతో విభేదాలు సద్దుమణిగినప్పటికీ, ఆళ్లగడ్డ ఘటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆళ్లగడ్డలో ఆదివారం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వీరిద్దరిని విజయవాడకు రావాల్సిందిగా సీఎం ఆదేశించారు. గత కొంత కాలంగా మంత్రి అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు ఉన్నాయి.
గతంలో ఈ రెండు వర్గాల మధ్య సీఎం సయోధ్య కుదిర్చారు. మంత్రి కాలవ శ్రీనివాసులు కూడా జొక్యం చేసుకుని, ఇద్దరి మధ్య విభేదాలకు తెరదించే ప్రయత్నం చేశారు. సంయమనంతో వ్యవహరిస్తామని ఇద్దరూ చెప్పినప్పటికీ, ఆదివారం మళ్ళీ ఇరువర్గాల మధ్య విభేదాలు మరోసారి వీధికెక్కాయి. సీఎం పిలుపు మేరకు నిర్వహించాల్సిన సైకిల్ యాత్రను మంత్రి అఖిలప్రియ, సుబ్బారెడ్డి వేర్వేరుగా ఆదివారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డిపై మంత్రి అనుయాయులుగా భావిస్తున్న కొంతమంది రాళ్లతో దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతమందిని అరెస్టు చేశారు. పార్టీ కోసం సర్దుకుపోతానని సుబ్బారెడ్డి, తనకు దాడి చేయించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పడంతో రాళ్లదాడి వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా సార్లు చెప్పినా, పరిస్థితిలో మార్పు రాకపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీంతో వీరిద్దరిని మంగళవారం ఉండవల్లికి రావాలని ఆదేశించారు.