ఆంధ్రప్రదేశ్‌

అట్టుడుకుతున్న ఆళ్లగడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 23: తన తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి చిరకాల స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య ఏర్పడిన వివాదంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మనస్ఫర్థలు బయటపడినా నాటి ఎన్నికల దృష్ట్యా టీడీపీ అధినేత జోక్యంతో ఏవీ పార్టీ కోసం పనిచేశారు. ఎన్నికల అనంతరం విభేదాలు యథావిధిగా కొనసాగుతూ దాడిచేసే స్థాయికి చేరుకున్నాయి. భూమా అఖిలప్రియతో ఏర్పడిన విభేదాల కారణంగా ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తన వర్గంతో కలిసి ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చంద్రబాబు ఇరువురు నేతలను పిలిపించి సమన్వయంతో పనిచేసుకుపోవాలని, విభేదాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని సూచించి కలిసి పని చేయాలని ఆదేశించారు.
అయితే ఆయన మాటలు అమరావతిలో విని అక్కడే వదిలేసిన భూమా, ఏవీ వర్గాలు కలిసి పని చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి అఖిలప్రియ ఆళ్లగడ్డ మండలంలో, ఏవీ సుబ్బారెడ్డి శిరివెళ్ల మండలంలో వేర్వేరుగా సైకిల్ యాత్రలు చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి యాత్రపై కొందరు రాళ్లు విసిరి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని తరిమివేయడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తరువాత తనపై దాడి చేయడానికి కారణం మంత్రి అఖిలప్రియేనని. తన సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. సుబ్బారెడ్డితో విభేదాలు ఉన్నప్పటికీ దాడి చేసేంత నీచమైన స్థితికి దిగజారలేదని అఖిల ప్రియ వివరణ ఇచ్చారు. సుబ్బారెడ్డి పిల్లలతో తనకు ఎంతో అనుబంధం ఉందని, వారికి అన్యాయం చేసే అవకాశమే లేదని ఆమె అన్నారు. సుబ్బారెడ్డిపై ఎవరు దాడి చేసినా తప్పేనని ఆమె ఖండించారు. అయితే ఆళ్లగడ్డలో మాత్రం ఏవీ వర్గీయులు సోమవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పరిస్థితులు చేయి దాటి పోతాయన్న ఆందోళన నెలకొంది. తనపై జరిగిన దాడి వివరాలను ఏవీ సుబ్బారెడ్డి పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోవడంతో వారు చంద్రబాబుకు విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేసి సుమారు 10 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఇచ్చిన వివరణను ముఖ్యమంత్రికి పంపినట్లు సమాచారం. దాడి ఘటనకు నిజంగా అఖిలప్రియకు సంబంధం ఉన్నా, సంబంధం లేని అంశాన్ని ఏవీ రాజకీయం చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా చంద్రబాబునాయుడు తీవ్రంగా పరిగణించి చర్యలకు సిద్ధమవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి . చిలికిచిలికి గాలివానలా మారింది.