ఆంధ్రప్రదేశ్‌

రూ. 1600 కోట్లతో వ్యవసాయ పరివర్తన పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో సంయుక్తంగా రూ.1600 కోట్లతో ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం చేపట్టనున్నామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మంగళవారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకంపై ప్రాజెక్టు సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాలకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలలో నిర్వహిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1600 కోట్ల రూపాయలు కాగా ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా రూ.1120 కోట్లు (70 శాతం), రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.480 కోట్లు (30 శాతం) వాటాగా ఉంటుందన్నారు. ప్రాజెక్టు వ్యవధి 6 సంవత్సరాలు అన్నారు. 2018-19 నుంచి 2023-24 వరకు ఎంపిక చేసిన చెరువులలో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, లాభదాయకం చేయడం, వాతావరణ వైవిధ్యాలను ఎదుర్కొనే శక్తిని రైతులకు కలిగించటం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం అన్నారు. సాగునీటి వినియోగ సమర్థత పెంపుదలకు రూ.950.4 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. వీటి ద్వారా నీటి వినియోగదారుల సంఘాల బలోపేతం, సామర్థ్య పెంపుదల, చిన్న తరహా నీటి వనరుల పనితీరును మెరుగుపరచడం, నీటి ఉత్పాదకత, నీటి వినియోగ సామర్థ్యం పెంచుతామన్నారు. అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి రూ.495.9 కోట్లు, వాతావరణ అనుకూల వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థలను ప్రోత్సహించడం, చేపల ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించడానికి ఖర్చు చేయనున్నామన్నారు.