ఆంధ్రప్రదేశ్‌

నేడు వైకాపాలోకి కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 24: భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కు మంగళవారం తన రాజీనామా లేఖను పంపినట్లు విశ్వసనీయ సమాచారం. గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కన్నా తన అనుచరులు, సన్నిహితులు, కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్ర విభజనతో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్‌ను వీడి ఆయన బీజేపీలో చేరారు. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఏపీలో రాజకీయ భవిష్యత్‌లేదని భావించిన ఆయన ఢిల్లీలో అమిత్‌షా నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కన్నాకు నామినేటెడ్ పదవిలో ప్రాధాన్యత ఉంటుందని సన్నిహితులు ఆశించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు కన్నా, మాజీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. అయితే పురంధ్రీశ్వరి తాను జాతీయ రాజకీయాలకు పరిమితం కావాలని నిర్ణయించుకోవటంతో కన్నా, సోము ఇద్దరిలో ఎవరో ఒకరికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ సామాజిక సూత్రీకరణలను తెరపైకి తీసుకువచ్చి మరోనేత అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో కన్నా రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. దీనికితోడు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ, ప్రజా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలో మనుగడ సాగించే పరిస్థితులులేవని భావించిన కన్నా ప్రత్యామ్నాయంగా కార్యకర్తల అభీష్టం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లాలో పాదయాత్రలో ఉన్నందున ఆయన వద్దకు నేరుగా తన అనుచరగణంతో వెళ్లి బుధవారం ఉంగుటూరులో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అనుచరులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సులతో ఉంగుటూరుకు ర్యాలీగా బయల్దేరనున్నారు. జిల్లాలో తన సొంత నియోజకవర్గం పెదకూరపాడు లేదా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు కన్నాకు వైసీపీ అధినేత జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కన్నా రాజకీయ గురువు, మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు కూడా త్వరలో బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నట్ట్లు సమాచారం.