ఆంధ్రప్రదేశ్‌

ఈ-ప్రగతిపై సీఎం సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: వివిధ విభాగాలను ఈ-ప్రగతి వేదికతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ-ప్రగతి అనుసంధానంపై మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని విభాగాలను ఈ-ప్రగతి ఫ్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చి, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా తొలిదశలో వివిధ విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. తొలిదశలో 19 విభాగాలు ఈ-ప్రగతి పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విద్యా విభాగంలో 25 సేవలను ఖరారు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. ఇది ఏడు మాడ్యూల్స్‌గా చేస్తున్నారు. సంక్షేమానికి సంబంధించి 5 మాడ్యూల్స్‌తో 18 సేవలను, ప్రైమరీ సెక్టార్‌లో ఆరు మాడ్యూల్స్‌ను రూపొందించారు. పంచాయితీరాజ్, విభాగంలో ఆరు మాడ్యూల్స్‌తో 25 సేవలను దీని పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, మరింత వేగవంతం చేయాలని సూచించారు.