ఆంధ్రప్రదేశ్‌

అన్న క్యాంటీన్ల ఏర్పాటు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో అన్న క్యాంటీన్ల ఏర్పాట్లపై పురపాలక శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 71 మున్సిపాలిటీల్లో 203 అన్న క్యాంటీన్లు మంజూరు చేశామన్నారు. 187 క్యాంటీన్లకు ఇప్పటికే స్థలాలను గుర్తించామని, అందులో 39 స్థలాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అన్న క్యాంటీన్‌ల ఏర్పాటుపై ఏజెన్సీలు ఏమేరకు సంసిద్ధంగా ఉన్నాయో ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని వారికి స్పష్టం చేశారు. ప్రతి వారం అన్న క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో పురపాలక మంత్రి పి నారాయణ , వౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్ కన్నబాబు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మిషన్ డైరెక్టర్ చినతాతయ్య, తదితరులు పాల్గొన్నారు.