ఆంధ్రప్రదేశ్‌

మోదీని గద్దె దించుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలని, ఇందుకోసం పెద్దఎత్తున పోరాటాలను చేపట్టాలని, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి పిలుపునిచ్చారు. మోదీపై తెలుగోడి తిరుగుబాటు అనే నినాదంతో ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి నేతృత్వంలో స్థానిక సాయినిర్మలా రామయ్య కల్యాణ మండపంలో బుధవారం సభ జరిగింది. విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రతినిధులు సభకు హాజరయ్యారు. ఈసందర్భంగా సమావేశంలో ఆరు తీర్మానాలు చేశారు. వీటిలో మే 3న విజయవాడలో రాష్టస్థ్రాయి సభ జేఈసీ ఏర్పాటు చేయాలని, మే 9న ఎన్‌జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ల ముందు ధర్నాలు చేయాలని, మే 27న దక్షిణ భారత తెలుగు సంఘాల సదస్సు తిరుపతిలో నిర్వహించాలని, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈనెల 28,29,30 తేదీల్లో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని తీర్మానించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, విశాఖ రైల్వేజోన్, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఈ సభలో తీర్మానాలు చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ పార్లమెంట్‌ను గౌరవించని ప్రధానిని తామెందుకు గౌరవించాలన్నారు.
పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని ఆయన అమలుచేయని పక్షంలో ఆయన్ను తెలుగువారు ఏమాత్రం గౌరవించరని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పారని విమర్శించారు. అందుకే తెలుగు ప్రజలు తిరుపతి నుంచి శంఖారావాన్ని పూరించి రాష్టవ్య్రాప్తంగా చైతన్య సదస్సులు నిర్వహించి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. దేశంలో తెలుగువారు ఏమూల ఉన్నా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని అడుగుతామని ఆయన పేర్కొన్నారు.