ఆంధ్రప్రదేశ్‌

కార్డులు పోయాయని దిగులుపడొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని లక్షలాది మంది పింఛన్‌దారులు తమ దైనందిన జీవితంలో ఏదోఒక కార్డు పోగొట్టుకోవటం సహజం. అయితే కార్డులు పోయిన సమయంలో ఏంచేయాలో అర్థంకాక చాలామంది పింఛన్‌దారులు ఆందోళన చెందుతుంటారు. ఏ కార్డు పోయినా కంగారుపడాల్సిన అవసరం లేదని పెన్షన్‌దారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య చెప్పారు. పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు పోయినా ఏపీ ఆన్‌లైన్, మీ సేవల ద్వారా పొందవచ్చని తెలిపారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు, తదితర ముఖ్య పత్రాలు పోగొట్టుకున్నట్లు ఏడాదికి సుమారు 3వేలకు పైగా కేసులు పోలీసు స్టేషన్లలో నమోదవుతున్నాయి. కొన్ని కార్డులు పోగొట్టుకుంటే కచ్చితంగా పోలీసు కేసు నమోదు కావాలి. మరికొన్నింటికి రెవెన్యూ, మీసేవ కేంద్రాల ద్వారా పొందేందుకు వీలుంది. పోయిన కార్డులను మళ్లీ సులభంగా పొందేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా మరింత సమాచారం తెలుసుకునేందుకు వీలుంది. పాన్‌కార్డు అనేది కచ్చితమైన అవసరంగా మారింది. బ్యాంకుల్లో 50వేల రూపాయలు దాటి లావాదేవీలు చేయాలంటే ఇది తప్పనిసరి. ఆదాయ పన్ను శాఖ జారీచేసే పాన్‌కార్డు పోతే సంబంధిత శాఖ కార్యాలయంలో పోయిన కార్డు నెంబరు, నివాస గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు అందించాలి. కొత్త కార్డు కోసం 96 రూపాయల రుసుం చెల్లిస్తే 25రోజుల వ్యవధిలో మరో కార్డు జారీ చేస్తారు. వెబ్‌సైట్ల ద్వారా మరింత సమాచారం తెలుసుకుని ఈ కార్డును సులభంగా పొందేందుకు వీలుంది. బహుళ ప్రయోజనాలు కలిగిన ఆధార్ కార్డు పోతే టోల్ ఫ్రీ నెంబరు 18003001947 ద్వారా పూర్తి వివరాలు నమోదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డును తపాలా ద్వారా పంపిస్తారు. వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం పొందవచ్చు. రవాణా శాఖలో మారిన నిబంధనలతో వాహనం ముట్టుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఇది పోతే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రశీదు పొందాలి. పోలీసులిచ్చే ధ్రువపత్రంతో పాటు ఎల్‌ఎల్‌డీ దరఖాస్తును సమీపంలో ఆర్టీవో కార్యాలయానికి అందజేయాలి. 10 రూపాయల స్టాంపుపై డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి దారితీసిన పరిస్థితులు వివరించాలి. ఈ ప్రక్రియ పూర్తిచేసిన తరువాత 30రోజుల వ్యవధిలో కొత్త లైసెన్స్ పొందవచ్చు. ఓటరు కార్డు పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ వివరాలు, కార్డు నెంబరు ఉంటే 10 రూపాయల రుసుం చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా కొత్త కార్డు వెంటనే పొందవచ్చు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను చూడాలి. గుర్తింపుతో పాటు రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు అవసరమైన రేషన్ కార్డును పోగొట్టుకుంటే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐసిటీఎస్2.ఎపి.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. అక్కడ యూజర్ నేమ్ ఆప్షన్ వద్ద గెస్ట్ అని టైప్ చేయాలి. పాస్‌వర్డ్ ఆప్షన్ వద్ద గెస్ట్123 అని టైప్ చేయాలి. రేషన్ కార్డు నెంబరును నమోదు చేస్తే నకలు ప్రతిని పొందవచ్చు. ఏపీ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహశీల్దార్ దాన్ని పరిశీలించి అదే నెంబరుతో కార్డు జారీ చేస్తారు. ఏటీఎం కార్డు పోతే చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఈ కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకులకు వెళ్లి ఖాతా నెంబరు చెబితే లావాదేవీలు జరగకుండా బ్లాక్ చేస్తారు. తరువాత కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే 15రోజుల వ్యవధిలో నేరుగా తపాలా కార్యాలయం ద్వారా ఇంటికే కార్డు చేరుతుంది. దీనికి ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా నిర్ణీత మొత్తంలో రుసుం వసూలు చేస్తాయని వీరయ్య వివరించారు.