ఆంధ్రప్రదేశ్‌

అందరూ టచ్‌లో ఉన్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 29: రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వైసీపీలోకి వచ్చేందుకు తమతో చర్చలు జరుపుతున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖలో సోమవారం జరగనున్న వంచన దీక్ష ఏర్పాట్లను పరిశీలించడానికి ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, హోదా కోసం నాలుగేళ్ళ నుంచి వైసీపీ ఒక్కటే పోరాడుతోందని అన్నారు. వైసీపీ పోరాటం ప్రజలను ఆకట్టుకుంది. పార్టీకి ప్రజల మద్దతు పెరిగింది. దీంతో ఆయా పార్టీల వారు తను నిత్యం సంప్రదిస్తున్నారని అన్నారు. అలాగే వైసీపీ నుంచి గెలిచి, టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని ఎన్‌డీఏలో చేరమని కేంద్ర మంత్రి అథవాలే ఆహ్వానించడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, తమనే కాదు, టీడీపీని కూడా వెనక్కు రమ్మనమని పిలిచారు.
ఏదియేమైనా ప్రస్తుత ఎన్డీయే కాదు, మిగిలిన ఏ ఫ్రంట్‌లైనా రాష్ట్రానికి హోదా ఇస్తే, దానికి వైసీపీ మద్దతు ఇస్తుందని చెప్పారు. హోదా కోసం తమ పార్టీ ఎంపీలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అయినా, కేంద్రం స్పందించలేదు. త్వరలోనే లోక్‌సభ స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని ఎంపీలు కోరనున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే, టీడీపీ ఎంపీలు మాత్రం ఢిల్లీలో కేవలం డ్రామాలాడి, ప్రజలను వంచించారని ఆయన ఆరోపించారు. ప్రధాని నివాసం ముందు నిరసన కూడా హైడ్రామానే అని ఆయన అభివర్ణించారు. కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేసినప్పుడే చంద్రబాబు నిరసన తెలపాల్సిందిపోయి, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని రావడం ఆయన చేసిన పెద్ద తప్పు అని రెడ్డి అన్నారు. మళ్లీ ప్యాకేజీ వద్దు, హోదా కావాలని యు టర్న్ తీసుకుని ప్రజలను మరోసారి మోసం చేశారని ఆయన అన్నారు. తిరుపతిలో ఆయన ధర్మ పోరాటం చేస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని విజయసాయిరెడ్డి అన్నారు. అది ధర్మపోరాటం ఎలా అవుతుంది? చంద్రబాబు చేస్తున్నది ముమ్మాటికీ అధర్మపోరాటమేనని అన్నారు.
నేటి ఉదయం 7 గంటలకు దీక్ష ప్రారంభం
విశాఖలోని స్థానిక ఉమెన్స్ కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ వంచన దీక్ష కొనసాగుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ దీక్షలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. రెండో తేదీ నుంచి విశాఖ నగరంలోని అన్ని వార్డుల్లో జగన్ దీక్షకు మద్దతుగా సంఘీభావ యాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. అలాగే జగన్ పాదయాత్ర 2000 కిలో మీటర్లు పూర్తయిన రోజున అంటే మే 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైపీసీ నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి