ఆంధ్రప్రదేశ్‌

చట్టాలపై మహిళలకు అవగాహన కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 30: రాష్ట్ర ప్రజలతో సత్సంబంధాలు కలిగిన మహిళా, శిశు సంక్షేమ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా ఉద్యోగులు కష్టించి పనిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత కోరారు. గురువారం గుంటూరు లాడ్జిసెంటర్‌లోని జంపని టవర్స్‌లో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్ర కార్యాలయాలు నూతన రాజధానికి తరలించడం సంతోషదాయకమని, ఈ కారణంగా రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యాలయాలు తరలిరావడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కానున్నాయన్నారు. అంగన్‌వాడీల్లోని పిల్లలకు, గర్భిణీలకు మంచి పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళల చట్టాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఏ వాహనంలోనైనా ప్రయాణించేటప్పుడు ఇబ్బందులు ఎదురైనట్లయితే అందుకు కారణమైన సంబంధిత వ్యక్తులపై నిర్భయ చట్టం కింద కేసులను నమోదు చేస్తామని తెలియజేశారు. రాజధానికి తరలిన ఉద్యోగులు తమ స్వంత ఊరికి వచ్చినట్లు ఆనందం వ్యక్తంచేస్తున్నారని, దీనితో కార్యాలయ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని తెలిపారు. రాష్టశ్రాఖలో సుమారు 125 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొంత మంది ఇప్పటికే వచ్చారని, మిగతా వారు కూడా జూలై 15 నాటికి వస్తారని, అప్పటి నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పారు.

chitram గుంటూరులో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పీతల సుజాత