ఆంధ్రప్రదేశ్‌

మోదీ ఆకారం భీకరం.. లోపలంతా డొల్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్రమోదీ ఎంతో గొప్ప వ్యక్తి అని భావించానని, అయితే ఆకారం భీకరమని, లోపలంతా డొల్ల అనే విషయం ఆయన ఆంధ్రరాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుతో తేటతెల్లమయ్యిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తిరుపతి ఎస్వీయు తారకరామస్టేడియంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం నమ్మకద్రోహం, కుట్రలపై ధర్మపోరాటం సభను తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది. ఈ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ అనైతికంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఐదుకోట్ల ఆంధ్రులు చాలా నష్టపోయారన్నారు. వెంకన్నసాక్షిగా మోదీ ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. వాటిని నెరవేర్చాలన్నారు. తెలుగోడి సహనానికి పరీక్ష పెట్టిన వారు గతంలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారో నేటి పాలకులు తెలుసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశం అంతా పర్యటిస్తూ నేను మీకు అండగా ఉంటానని చెబుతున్నారని, మరి తెలుగువారిపట్ల వివక్ష ఎందుకని ప్రశ్నించారు. అది వారి ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నానన్నారు. దేశానికి ప్రధాని ఉండి ఉత్తరం, దక్షిణం అంటూ వేర్వేరుగా చూడడం మంచిది కాదన్నారు. 68యేండ్లు వయసుండి 40యేండ్ల సుధీర్ఘరాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్రం కోసం చేస్తున్న ధర్మపోరాటానికి అంతిమ విజయం తప్పదన్నారు.
జగన్ ఖైదీ నెంబర్ 6093: మంత్రి నారా లోకేష్
తెలుగుజాతితో చెలగాటం ఆడితే వారి శక్తి ఎలా ఉంటుందో దేశచరిత్రలో జరిగిన అనుభవాలను నేటి ప్రధాని నరేంద్రమోదీ తెలుసుకుని వ్యవహరించాలని రాష్ట్ర పంచాయతీ శాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు కాంగ్రెస్ ఎలాఅధోగతి పాలయ్యిందో, అదే పరిస్థితి బీజేపీకి తప్పదన్నారు. తాను అక్రమాలకు పాల్పడుతున్నానని చెబుతున్న వారు ఎవరైనా దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలతో ముందుకు రావాలని ఈ వేదిక నుండి తాను సవాల్ విసురుగుతున్నానన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడితే టీడీపీ సహించబోదన్నారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి మహానుభావులు ఉన్న పార్టీ బీజేపీ అన్నారు. అలాంటి పార్టీ నేడు దొంగలతో లాలూచీ పడడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా 12కేసుల్లో ఏ 1గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఖైదీ నెంబర్ 6093 అన్నారు. అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అని భావిస్తే ఆయనతో పొత్తు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ, వైకాపాలు లాలూచీ పడ్డా టీడీపీకి జరిగే నష్టం ఏమీ ఉండదన్నారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కూడా తిరుగులేని విజయాన్ని ప్రజలకు టీడీపీకి అందిస్తారన్నారు. తాను తాత, నాన్న కన్నా గొప్ప పేరు తెచ్చుకోకపోయినా, వారికి చెడ్డపేరు తీసుకురానన్నారు.