ఆంధ్రప్రదేశ్‌

జగన్ కన్నా వంచకుడెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 30: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లక్ష కోట్లు సంపాదించడం వంచన కాదా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఓ ప్రకటనలో విశాఖలో వైకాపా వంచనదినంపై విరుచుకుపడ్డారు. వంచకులకు నయవంచన దినం పాటించే అర్హత ఉందా అన్నారు. 12 ఛార్జిషీట్లు ఉన్న జగన్ వంచకుడా.. లేక 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పేదలకు సేవచేసే చంద్రబాబు వంచకుడా అని ప్రశ్నించారు. లోటస్ పాండ్, బెంగళూరు, ఎలహంక, ఇడుపులపాయ రాజ భవనాలు నిర్మించింది పేదల సొమ్ముతో కాదా అన్నారు. పేదల సొమ్ము దోపిడీచేసి ఎస్టేట్లు నిర్మించిన జగన్‌ను మించిన వంచకుడెవరని ప్రశ్నించారు. నాలుగు రోజులు పాదయాత్ర, రెండు రోజులు లాయర్లతో భేటీ, ఒకరోజు కోర్టుబోనెక్కడం వంచన కాదా అన్నారు. విభజన సమయంలో సోనియాతో లాలూచీపడి బెయిల్ తెచ్చుకోవడం వంచన కాదా అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం ఇప్పుడు బీజేపీతో లాలూచీ పడటం వంచన కాదా.. పోలవరంపై ఫిర్యాదులు, కోర్టు కేసులతో అడ్డుకోవడం వంచన కాదా అన్నారు. తన బాబాయితో లేఖలు రాయించి, ఉపాధి కూలీల పొట్టగొట్టడం వంచన కాదా.. రాజధానిపై కోర్టు కేసులు వేయించి, ల్యాండ్ పూలింగ్ అడ్డుకోవడం వంచన కాదా? వైఎస్ పాలనలో రైతులను, మహిళలను, యువతను దారుణంగా వంచించలేదా? డ్వాక్రా మహిళలను మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు బలిచేయడం వంచన కాదా? బీజేపీ నమ్మకద్రోహం చేస్తే జగన్ విమర్శించకపోవడం నయవంచన కాదా అని యనమల ఘాటుగా ప్రశ్నించారు. పాదయాత్రలో జగన్ ప్రసంగాల్లో ప్రధాని మోదీ పేరెత్తకపోవడం నయవంచన కాదా? మోదీని ప్రశ్నిస్తే బేడీలు పడతాయనే భయం కాదా? బీజేపీ చేతిలో తోలుబొమ్మగా ఆడుతున్న జగన్ కన్నా వంచకుడు ఎవరు? ఇచ్చిన హామీలను నెరవేర్చని మోదీని ప్రశ్నించకపోవడం వంచన కాదా అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు కేసులకు హాజరు అవుతోంది వంచన కేసుల్లో కాదా? తనపై నమోదైన అభియోగాల్లో మోసం, దగా, నయవంచన సెక్షన్లు లేవా? అసలు జగన్‌కు వంచన దినం పాటించే అర్హత ఉందా? అంటూ యనమల ధ్వజమెత్తారు.