ఆంధ్రప్రదేశ్‌

నిఘా నీడలో బాబు ధర్మపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 30: ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో తిరుపతి క్షేత్రంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని పార్టీకు అతీతంగా సోమవారం తిరుపతిలో నిర్వహిస్తున్న ధర్మపోరాట బహిరంగ సభకు భారీ భద్రత కల్పించారు. సుమారు 2వేలమంది పోలీసులను నియమించారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ఎస్వీయు తారకరామస్టేడియంలో ఈ ధర్మపోరాట సభ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వచ్చారు. సుమారు లక్షమంది ప్రజలకు హాజరవుతారని పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను చేశారు. అధునాతన సీసీ కెమెరాలు, డ్రోన్‌లు, బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటి బలగాలను రంగంలోనికి దింపారు. ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి ముందుగా తిరుమలకు వెళ్లి శ్రీవారి ఆశీస్సులు పొంది అటు తరువాత సభకు రానున్న నేపధ్యంలో రేణిగుంట మార్గంలోను, తిరుమల కనుమ మార్గాల్లోను సాయుధ బలగాలను మొహరింపజేశారు. అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఎ ఎస్పీలు మురళీకృష్ణ, అడ్మిన్ శ్రీనివాస్, క్రైమ్ సిద్దారెడ్డి, లా అండ్ ఆర్డర్ సుబ్రమణ్యం స్వామి, డి ఎస్పీలు మునిరామయ్య, ఈ శ్వర్‌రెడ్డి, ట్రాఫిక్ డి ఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి, ఎస్ బి డి ఎస్పీ నరసింహారెడ్డి, తిరుమల ఒన్‌టౌన్ సీ ఐ రామకృష్ణ, టు టౌన్ సీ ఐ వెంకటరవిల ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సాయుద బలగాలను మొహరించారు.