ఆంధ్రప్రదేశ్‌

చట్టసభల హుందాతనాన్ని కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 30: చట్టసభల హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పార్లమెంటులో విభజన హామీల అమలు, హక్కుల అంశాలపై తెలుగుదేశంపార్టీ చేస్తున్న ధర్మయుద్ధంపై సోమవారం సాయంత్రం గుంటూరు ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో స్పీకర్ స్పందిస్తూ తాను ఐదు కోట్ల ఆంధ్రప్రజానీకంలో ఒకడిగా కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. విభజన చట్టంలో ఉన్నవీ, లేనివీ కూడా నెరవేరుస్తామని, రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా మారుస్తామని ఎన్నికల ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ వాగ్దానాలు చేశారని, అసలు చట్టసభల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చక పోవటం సమంజసం కాదన్నారు. మాట తప్పటం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. చట్టసభల్లో చేసిన ప్రకటనలు, కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, పార్లమెంటులో హామీలు తదితర అంశాలను గౌరవించి పరిష్కరించటంలో ప్రభుత్వాల భాగస్వామ్యం తప్పనిసరన్నారు.