ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనుల్లో వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 30: వర్షాకాలం వచ్చేలోగా మే, జూన్ నెలల్లో వీలైనంత వేగంగా పోలవరం ఎర్త్‌వర్క్, కాంక్రీట్ పనులు చేపట్టాలని, లక్ష్యాన్ని అధిగమించినప్పుడే ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయగలమని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్దేశించారు. నీరు-ప్రగతి పనులు కూడా ముమ్మరంగా జరగాలని, తాను ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తానని వెల్లడించారు. సోమవారం గ్రీవెన్స్ హాల్‌లో 58వ సారి పోలవరంపై ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో స్పిల్ వే కాంక్రీట్ పనులు లక్ష క్యూబిక్ మీటర్లు దాటడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈనెలలో 1,15,658 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే కాంక్రీట్ పనులు జరగడం రికార్డుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.02శాతం పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం కుడి ప్రధాన కాలువ 89.44 శాతం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.16శాతం, స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ ఎర్త్‌వర్క్ 72.30 శాతం, స్పిల్‌వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16.40, డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం 85.10శాతం, జెట్ గ్రౌటింగ్ పనులు 64.90 శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60 శాతం పూర్తయినట్టు చెప్పారు. గత వారం రోజుల్లో 5.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 32వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 19 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 806.29 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికి 5.76 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,214.6 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయింది. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18వేల మెట్రిక్ టన్నులకు 10,800 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కోసం మొత్తం రూ.13,430.84 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ.8,294.97 కోట్లు ఖర్చు చేపట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో రూ.5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ.2,952.71 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు కృష్ణాడెల్టాలో రూ.10వేల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించామని చెప్పారు. ఇందులో రూ.6వేల కోట్ల విలువైన వరి దిగుబడులే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
బెకెమ్ ఇన్ఫ్రా రూ.కోటి విరాళం
ముఖ్యమంత్రి సహాయ నిధి, అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.కోటి విరాళంగా ఇచ్చింది. తన తండ్రి పూర్ణచంద్రరావు చేతుల మీదుగా ముఖ్యమంత్రికి చెక్కును బెకెమ్ ఇన్ఫ్రా చైర్మన్ బొల్లినేని కృష్ణమోహన్ అందించారు. ఈ సంస్థ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం..పోలవరంపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు