ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల నిర్మాణ బకాయిలు వారంలో చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: రాష్ట్రంలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెల్లించాల్సిన బకాయిలను వారం రోజుల్లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సుమారు రూ.600 కోట్ల మేర లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇందులో రూ.269 కోట్లు మంగళవారం విడుదల చేశామని, మిగిలిన మొత్తాన్ని మూడు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదమూడు జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లతో గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎండీ కాంతిలాల్ దండేలతో కలసి సమీక్ష చేసినట్లు తెలిపారు. హడ్కో నుండి రుణం అందడంలో జాప్యం వల్ల బకాయిల చెల్లింపులో కొంత ఆలస్యం అయిందని, దీన్ని అధిగమించామని, రానున్న రోజుల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ఒకే ఏడాదిలో 3.15 లక్షల ఇళ్లు పూర్తిచేసి రికార్డు సృష్టించామన్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3787 కోట్ల ఖర్చుతో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డుగా మంత్రి చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలసి 19 లక్షల ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు లక్ష్యంగా నిర్దేశించారని, ఈ లక్ష్యసాధన దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ప్రతి 250 ఇళ్లకు ఒక వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించేందుకు అనుమతి ఇచ్చామన్నారు. వారి పర్యవేక్షణలో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లబ్ధిదారుల ఇళ్లకు బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని ఆదేశించామన్నారు. ఎన్‌పీసీఐలో చెల్లింపులకు సంబంధించి ఆధార్ అనుసంధానం, జన్‌ధన్ ఖాతాల నెంబర్లు తప్పుల కారణంగా రూ.169 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఎన్‌పీసీఐ ద్వారా చెల్లింపుకాని రూ.169 కోట్ల నిధులు హౌసింగ్ డీఈ/ఇఇ ధృవీకరణతో సంబంధిత లబ్ధిదారు వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు డీబీటీ ద్వారా చెల్లింపునకు అనుమతి ఇచ్చామన్నారు. జూన్ తొలివారం నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికి 4.25 లక్షల ఇళ్లు పూర్తయినట్టు తెలిపారు. ఈ జూన్ నుండి ప్రతి నెలలో మంచి రోజులు చూసుకుని ఆయా రోజుల్లో సామూహిక గృహ ప్రవేశాలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. జూన్ మొదటి వారంలో 3.25 ఇళ్లు పూర్తవనున్నాయని, కనీసం మూడు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయించాలని ఆదేశించామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు మార్చి నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల జూన్ 15 వరకు రాష్ట్రంలో నిర్విరామంగా, నిరంతరాయంగా ఇళ్ల నిర్మాణం జరగాలని హౌసింగ్ అధికారులను ఆదేశించామన్నారు. ఉభయ గోదావరి, గుంటూరు, మరికొన్ని జిల్లాల్లో లోతట్టు, ఎత్తయిన ప్రాంతాల్లో లబ్ధిదారులకు స్థలాలు కేటాయించడం వల్ల చదును చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు యోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బిల్లుల చెల్లింపు, మార్కింగ్ కోసం గృహ నిర్మాణ సిబ్బంది ఎవరైనా డబ్బు అడిగితే 1100 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.