ఆంధ్రప్రదేశ్‌

జేడీఎస్‌ను చీల్చేందుకు బీజేపీ కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: కర్నాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అధికారం కోసం బీజేపీ జనతాదళ్(సెక్యులర్) పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కర్నాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటు వేశారన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు సంబంధించి రాజకీయ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో ఏర్పాటైన జోన్ల విషయంలో లేని నిబంధనలు, సంప్రదింపులు విశాఖ రైల్వేజోన్ విషయంలోనే పరిగణలోకి తీసుకోవడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. జోన్ ప్రకటనలో రాజకీయ నిర్ణయం కోసం రాజకీయేతర సంయుక్త కార్యాచరణ(నాన్ పొలిటికల్ జేఏసీ) పోరాడుతామని స్పష్టం చేశారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు