ఆంధ్రప్రదేశ్‌

విభిన్న ప్రతిభావంతులు నూరు శాతం ఓటర్లుగా నమోదు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: విభిన్న ప్రతిభావంతులను నూరుశాతం ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆర్పీ సిసోడియా అన్నారు. నగరంలోని ఓ హోటల్ హాలులో మంగళవారం విభిన్న ప్రతిభావంతులను ఓటర్లుగా నమోదు చేయటం, కల్పించాల్సిన సదుపాయాలపై సిసోడియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు జరిగింది. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ దేశంలో మూడు శాతం ఉన్న విభిన్న ప్రతిభావంతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు జిల్లా స్థాయిలో ఇప్పటికే వర్క్‌షాపులు నిర్వహించామన్నారు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో 21 సంవత్సరాల వయస్సు ఉన్న వారే ఓటర్లుగా నమోదు అర్హత ఉండేదని, ప్రస్తుతం 18 సంవత్సరాల వయస్సును ఓటరు నమోదుకు అర్హతగా నిర్ధారించారన్నారు. విభిన్న ప్రతిభావంతులు పలు కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధానంగా నమోదు స్థాయిలో సమస్యలు ఉన్నాయని ఎలక్ట్రోరల్ రోల్స్ నూరుశాతం జరగాలంటే విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలన్నారు. ఎలక్ట్రోరల్ రోల్స్ సులభతరం చేశామని ఆన్‌లైన్ ద్వారా కూడా కొత్తగా ఓటర్లు నమోదు కావడంతో పాటు మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా స్థాయిలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్వోలకు శిక్షణ ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు అయ్యేలా బూత్ లెవల్ అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో విభిన్న ప్రతిభావంతులకు ర్యాంప్‌లు, ట్రైసైకిల్స్, ఈవీఎంలలో ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి వుంటే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. కల్పిస్తున్న సదుపాయాలపై విభిన్న ప్రతిభావంతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వర్క్‌షాపుల ద్వారా సేకరించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని విభిన్న ప్రతిభావంతులను నూరు శాతం ఓటర్లుగా నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలను చేపడుతుందంటూ సిసోడియా అన్నారు. ఈ వర్క్‌షాపులో కలెక్టర్ లక్ష్మీకాంతం, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.