ఆంధ్రప్రదేశ్‌

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై ఆందోళన వద్దు: సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: కొత్తగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)తో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్న చెక్కులపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. తనకు ఇచ్చిన చెక్ వెనక్కిచ్చేశారని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం మంజూరైన వరమ్మ అనే మహిళ తమ దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు. సీఎంఆర్‌ఎంఎస్ ద్వారా చెక్కులు పొందిన లబ్ధిదారులకు ఏ రకమైన ఆందోళన అవసరం లేదని, వారు తమ చెక్కులను ఆయా శాఖల ద్వారా విజయవాడ ఎంజి రోడ్డులోని స్టేట్ బ్యాంక్‌కు పంపించి నగదుగా మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎఫ్‌ఎంఎస్ వల్ల కొంత అసౌకర్యం తర్వాత మే 1వ తేదీ నుంచి తిరిగి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇస్తున్న చెక్కులను నగదుగా మార్చుకోవడానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎంఆర్‌ఎఫ్ సహాయంపై లబ్ధిదారుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సహాయం పొందినవారు ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సహాయ నిధి కింద ఇచ్చే చెక్కులకు డబ్బును ఒక్కరోజులోనే చెల్లించే విధంగా చూడాలని ఆర్థికశాఖ కార్యదర్శికి తాము ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.