ఆంధ్రప్రదేశ్‌

అవినీతి తగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: రాష్ట్రంలో అవినీతి తగ్గిందని సీఎంఎస్ సంస్థ నివేదిక ఇచ్చిందంటూ అధికారుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. జూన్ నెలలో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు జారీచేయనున్నట్లు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్‌లో పౌరసరఫరాల శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొంతమంది ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి విమర్శలకు సీఎంఎస్ ఇచ్చిన నివేదిక సమాధానం లాంటిదన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పింఛన్లు కూడా ఇవ్వాలన్నారు. పౌర సరఫరాలశాఖ పనితీరు మరింత మెరుగుపర్చి ఆ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసంతృప్తికి కారణాలను గుర్తించి సంతృప్తి 90శాతం మేర సాధించాలన్నారు. పడవ ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి ఒక సమగ్ర విధానం రూపొందిద్దామని తెలిపారు.