ఆంధ్రప్రదేశ్‌

ప్రశ్నించే వారిపై కేసులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 19: రాష్ట్రంలో బ్రాహ్మణుల మధ్య వైరుధ్యాలు పెంచి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. శనివారం గుంటూరులోని వైన్‌డీలర్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య రెండు రోజుల సమావేశాలు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ అధ్యక్షతన శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కన్నా మాట్లాడుతూ ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అణచివేత ధోరణి మార్చుకోకుంటే ప్రజలు తిరగబడతారని స్పష్టంచేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అనేక దేవాలయాలను కూల్చివేసి ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరుగుతున్నట్లు ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్వయంగా ఆరోపిస్తే వయో పరిమితిని సాకుగా చూపించి ఆయన్ను విధుల నుండి తొలగించడం అమానుషమన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గానికి అండగా బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. బ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ బ్రాహ్మణులు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై రెండు రోజుల సమావేశాల్లో చర్చించి కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పులిపాక శ్రీనివాస్, పొన్నపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.