ఆంధ్రప్రదేశ్‌

తెలుగు ప్రజల ఉసురు తగిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 19: దేశంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీకి కాలం చెల్లిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. కర్నూలులో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి వ్యక్తిగత అజెండాతో ముందుకుపోయి పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కర్నాటకలో పార్టీ ఓటమికి, అక్రమ పద్ధతుల్లో ముఖ్యమంత్రి అయిన యెడ్యూరప్ప అసెంబ్లీలో బలనిరూపణ చేయలేకపోవడానికి తెలుగు ప్రజల శాపమే కారమని స్పష్టం చేశారు. ఎంతో నమ్మకంతో తెలుగుప్రజలు బీజేపీపై ఆశలు పెట్టుకుంటే వాటన్నింటినీ కేవలం వ్యక్తిగత కక్షల కారణంగా అడియాశలు చేశారని మండిపడ్డారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగువారితో పాటు కన్నడ ప్రజలు బీజేపీకి ఓటేయవద్దని తాము చేసిన విజ్ఞప్తిని అక్కడి ప్రజలు మన్నించి ఆ పార్టీని ఓడించారన్నారు. ప్రధానంగా తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయవడం తాము సాధించిన విజయమన్నారు. ప్రజలు బీజేపీకి పట్టం కట్టకపోయినా గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపై నిలబడి ఆ పార్టీ తీరును జాతీయ స్థాయిలో ఎండగట్టడం, బల పరీక్ష సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుండటంతో కొనుగోలుకు అవకాశం లేక యెడ్యూరప్ప వెనక్కి తగ్గారని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో నోట్ల రద్దు అనంతరం కొత్త రూ. 2వేల నోటు ప్రవేశపెట్టడం కేవలం రాజకీయాల్లో అక్రమాల కోసం వాడుకోవడానికే అనే విషయం ప్రజలకు స్పష్టమైందన్నారు. రూ. 2వేల నోటు ప్రవేశపెట్టడం సరైంది కాదని తమ పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రధాని మోదీకి చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. 2019లో కూడా ఇవే నోట్లతో మరోమారు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీకి తగిన శాస్తి జరిగింది
కర్నాటకలో భారతీయ జనతాపార్టీకి తగిన శాస్తి జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేద్దామనుకున్నారని, అయితే అటు న్యాయ వ్యవస్థ, ఇటు ప్రజల అండదండలతో బీజేపీ నేతల ఆటలు సాగలేదన్నారు. బీజేపీ వద్ద డబ్బు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సమయం లేకపోయిందన్నారు.
తెలుగు ప్రజలు బుద్ధిచె ప్పారు
బీజేపీ, ఆ పార్టీకి పరోక్షంగా మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసే వైఎస్సార్ సీపీ లాంటి స్వార్థ శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించే విధంగా చేసిన కుట్రలు, కుయుక్తులు కర్ణాటక అసెంబ్లీ వేదికగా తునాతునకలు అయ్యాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నాటకలో బీజేపీకి తెలుగువారి ఉసురు తగిలిందన్నారు.
తెలుగు జాతికి, ముఖ్యంగా దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌కి చేసిన నమ్మక ద్రోహానికి మోదీ, అమిత్‌షాకు కర్ణాటకలోని తెలుగు ప్రజలు బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పగా, అహంకారపూరిత ధోరణితో రాజ్యాంగ వ్యవస్థలను తమ సొంత తాబేదారులుగా వాడుకోవాలని చేసిన ప్రయత్నాలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో వమ్మయ్యాయన్నారు. కర్నాటక గవర్నర్ వ్యవహరించిన తీరు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. గత కేసుల తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా, మోదీ, అమిత్‌షా ఆశించిన విధంగా గవర్నర్లు రాష్ట్రానికొక తీరుగా నడుచుకుని ఆ పార్టీ రాజ్యకాంక్ష విస్తరణే ధ్యేయంగా పనిచేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో చేసిన నమ్మకద్రోహానికి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా స్పందిస్తారు, బుద్ధి చెబుతారంటూ దినకర్ హెచ్చరించారు. వైస్సార్‌సీపీ, ఇతర నాయకుల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఇది ప్రజాస్వామ్య విజయం
కర్నాటకలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వ, అవినీతి, అక్రమ విధానాలు ఓడిపోయాయన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాష్టవ్య్రాప్తంగా ప్రజాస్వామ్య విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.