ఆంధ్రప్రదేశ్‌

కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మొదటి విడతగా రూ. 450 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: అనంతపురం జిల్లా జంతలూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అమలు చేయాల్సినవాటిలో కేవలం 4 సంవత్సరాల్లోనే 85శాతం పూర్తిచేసి మరో సంవత్సరంలోపు 100 శాతం అమలుచేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉండగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అబద్ధప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకోవాలని ఆయన అన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి చేయకుండా కాలం గడిపిన టీడీపీ నాయకత్వం ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చురుకుగా చేయాలని హితవు పలికారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ త్వరితగతిన అమలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ రాష్ట్ర కమిటీ తరుపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.