ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఎంసెట్ కౌనె్సలింగ్ జాప్యంపై మంత్రి గంటా ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 19: ఎంసెట్ ఫలితాలను ఈనెల 2వతేదీన విడుదల చేసినప్పటికీ కౌనె్సలింగ్ నిర్వహణ ఆలస్యం అవుతుండటంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంత్రి ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ నరసింహరావు, జెఏన్‌టియూ కాకినాడ వైస్‌ఛాన్సలర్‌లతో మాట్లాడి కౌనె్సలింగ్ ఆలస్యం అవుతుండటంపై వివరణ కోరారు. వర్సిటికీ, ఉన్నత విద్యామండలి అధికారులకు సమన్వయం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమన్వయంతో ముందుకు వెళ్ళి కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏఐసిటిఈ అనుమతులు, కళాశాలల అఫిలియేషన్లపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంసెట్ కౌనె్సలింగ్ నిర్వహణకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారో వివరణ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అధికారులకు మంత్రి గంటా స్పష్టం చేశారు. కౌనె్సలింగ్ నిర్వహణపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. త్వరితగతిన కౌనె్సలింగ్ నిర్వహించాలని, అందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.