ఆంధ్రప్రదేశ్‌

ఇది కార్యకర్తల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల పండుగ మహానాడు అత్యంత వైభవంగా మే 27,28,29 తేదీల్లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. ప్రవాస టీడీపీ ఆధ్వర్యంలో కువైట్‌లో శనివారం జరిగిన మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రవాసాంధ్రుల నుద్దేశించి మాట్లాడారు. ఇక్కడకు రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు కూడు, గుడ్డ, నీడ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తదుపరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా, దేశవ్యాప్తంగా ఖండాంతరాల్లో తెలుగువాళ్లు అంటే తెలుగుదేశం అనే తీరుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. టెక్నాలజీకి మారుపేరు చంద్రబాబు, తనయుడు లోకేష్ మంత్రిగా, పార్టీ భవిష్య నాయకుడిగా రాష్ట్భ్రావృద్ధిలో పాలుపంచుకుంటున్నారని నాని అన్నారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న చంద్రబాబునాయుడు సారధ్యానికి ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం చాలా అవసరమన్నా రు. రాష్ట్రం పెట్టుబడులకు అనువుగా ఉందని ప్రతి ఒక్కరి సహకారం రాష్ట్భ్రావృద్ధికి ఉండాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కువైట్ తెలుగుదేశం అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు, ఉపాధ్యక్షుడు బాబు, కార్యదర్శి రామ్మోహన్, ఉప కార్యదర్శి రాధామాధవ్, కోశాధికారి రమేష్‌నాయుడు, అర్బన్ పార్టీ అధికార ప్రతినిధి వంకిపురం సంపత్ బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..కువైట్‌లో జరిగిన టీడీపీ మినీ మహానాడు హాజరైన
విజయవాడ ఎంపీ కేశినేని నాని, తదితరులు