రాష్ట్రీయం

నేడు సీబీఎస్‌ఈ విద్యార్థులకు ర్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 29: ఏపీ ఎంసెట్-2018 సీబీఎస్‌ఈ విద్యార్థులకు సంబంధించి ర్యాంకులను బుధవారం జేఎన్‌టీయూ (కాకినాడ) ప్రకటించనుంది. ఎంసెట్‌లో అర్హత సాధించి ఇంకా ర్యాంకులు పొందని సీబీఎస్‌ఈ విద్యార్థులు తమ డిక్లరేషన్ ఫారంలను అందజేయడంతో ర్యాంకులను ప్రకటిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు మంగళవారం తెలియజేశారు. సీబీఎస్‌ఈ సిలబస్ విద్యార్థుల మార్కులను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించామన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తుల్లో పేర్కొన్న మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ర్యాంకులు అందిస్తామన్నారు. ఎంసెట్ వెబ్‌సైట్ నుండి కూడా ర్యాంకులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
ఇంటర్ బోర్డు కాకుండా వేరే బోర్డుల నుండి ఎంసెట్‌కు హాజరై, ర్యాంకులు పొందని అభ్యర్ధులు వారి మార్కుల జాబితాలను అందజేసిన వెంటనే ర్యాంకులు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. సీబీఎస్‌ఈ, ఏపీవోఎస్‌ఎస్, టీఎస్‌వోఎస్‌ఎస్, ఎన్‌ఐవోఎస్, డిప్లమో, ఆర్‌జీయుకేటీ, ఐఎన్‌సీ తదితర బోర్డుల నుండి ఎంసెట్‌కు హాజరైన అభ్యర్థుల మార్కుల జాబితాలను పరిశీలించిన అనంతరం మార్కుల వెయిటేజీని తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తున్నామన్నారు. ఎంసెట్ ర్యాంకులకు సంబంధించి ఏ విధమైన సందేహాలున్నా 0884-2340535, 0884-2356255 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కన్వీనర్ సాయిబాబు కోరారు.