రాష్ట్రీయం

రెండు నెలల్లో చెల్లించకుంటే నిరవధిక నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: ఎవరు అధికారంలో ఉన్నా సరే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరులో చేపట్టిన న్యాయపోరాట దీక్ష, ఆత్మఘోష పాదయాత్ర విజయవంతం కావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యుడు, మంత్రి నక్కా ఆనందబాబును గురువారం దీక్షా శిబిరం వద్దకు ప్రభుత్వం దూతగా పంపినట్లు తెలిపారు. తమ డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఈ సమస్యపై మంత్రివర్గంలోనూ చర్చించారని ఆయన పేర్కొన్నారు. అనంతరం అసోసియేషన్ నేతలతో జరిగిన సమావేశంలో బాధితులకు న్యాయం చేసే బాధ్యతను తానే స్వీకరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. దాసరిభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాధరెడ్డి, తిరుపతిరావుతో కలసి ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలోని 20 లక్షల మంది బాధితులకు రూ.3467 కోట్ల వరకూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు రావాల్సి ఉందన్నారు. చేతిలో డబ్బు లేక అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కారణంగా ముందుగా రూ.20వేలు అంతకంటే తక్కువ డిపాజిట్లు కలిగిన వారికి చెల్లింపుల కోసం రూ.1180 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అయితే ఈ నెల 5న కోర్టులో వాదనల తర్వాత ఎంత విడుదల చేయాలనే విషయమై నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు. బాధితులకు ఒక విధానం ప్రకారం చెల్లింపులు జరపాలని కోరామన్నారు. ఈ ప్రక్రియ రెండు నెలల్లో జరగాలని, లేనిపక్షంలో నిరవధిక నిరాహారదీక్ష చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవ్వా సోదరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను సీఐడీ ఇంతవరకూ ప్రభుత్వానికి అటాచ్ చేయలేదని, ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.