ఆంధ్రప్రదేశ్‌

చివరి దశకు కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 17: పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్‌కు సంబంధించి జెట్ గ్రౌటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు పోలవరం హెడ్ వర్క్సు జరుగుతున్న ప్రాంతంలో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో పనులకు ఆటంకం తలెత్తకుండా నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని కూలింగ్ కాంక్రీటు సమతుల్యతలో మార్పులుచేశారు. వాతావరణంలో వేడికి అనుగుణంగా సాంకేతిక విధానంలో కూలింగ్ కాంక్రీటు మిక్సింగ్ చేస్తున్నారు. మిక్సింగ్ వేసిన తర్వాత కాంక్రీటువేసే సమయానికి వ్యత్యాసం లేకుండా సూక్ష్మ విధానంలో సమయాన్ని నిర్దేశించుకుని కాంక్రీటులో జాగ్రత్త వహించాల్సివుంటుంది.
ప్రాజెక్టు సైట్‌లో నీటి మట్టం పెరగడంవల్ల డయాఫ్రం వాల్ పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం జెట్ గ్రౌటింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు జరుగుతున్నాయి. మరింత నీటిమట్టం పెరిగితే మాత్రం జెట్ గ్రౌటింగ్ పనులకు ఆటంకం తలెత్తే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చివరి దశకు చేరుకున్న జెట్ గ్రౌటింగ్ పనులను ఏదో విధంగా పూర్తిచేయాలని తొందర పడుతున్నారు. మొత్తం 3467 మీటర్ల కాఫర్ డ్యామ్‌కు గాను ఇప్పటి వరకు 2974 మీటర్ల మేర జెట్ గ్రౌటింగ్ పూర్తయింది. గత వారం ముఖ్యమంత్రి సందర్శించే సమయానికి పరిశీలిస్తే 85.80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 493 మీటర్లు మాత్రమే జెట్ గ్రౌటింగ్ మిగిలివుంది. ఇక పోలవరం ప్రధాన పనులను పరిశీలిస్తే.. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్‌కు సంబంధించి 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను గతం వారం నాటికి 835.78 లక్షల క్యూబిక్ మీటర్లు (74.90 శాతం) పూర్తయింది. అదే విధంగా స్పిల్‌వే, స్పిల్ బేసిన్, స్పిల్ ఛానల్‌కు సంబంధించి 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనికి గాను 9.28 లక్షల క్యూబిక్ మీటర్లు (25.20 శాతం) పూర్తయింది. ఇక రేడియల్ గేట్లు ఫ్యాబ్రికేషన్‌కు సంబంధించి 18వేల మెట్రిక్ టన్నులకు గాను గత వారానికి 11వేల మెట్రిక్ టన్నులు పూర్తయింది. కనెక్టివిటీస్‌కు సంబంధించి మొత్తంగా గత వారం నాటికి 57.96 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు సంబంధించి మొత్తం 177.9 కిలోమీటర్లకు గాను, ఇందులో 176.20 కి.మీ. లైనింగ్ జరగాల్సి వుండగా 149.39 కి.మీ. మేర (84.8 శాతం) పనులు పూర్తయ్యాయి. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి మొత్తం 210.92 కిలోమీటర్లకు గాను 164.74 కి.మీ. పూర్తయింది. గత వారం వరకు 78 శాతం పూర్తయింది. మొత్తం 210.92 కి.మీ లైనింగ్‌కు గాను ఇప్పటి వరకు 124.59 కి.మీ. లైనింగ్ పూర్తయింది. పోలవరం కుడి ప్రధాన కాలువ పరిధిలో మొత్తం 255 స్ట్రక్చర్లకు గాను ఇప్పటి వరకు 185 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. ఇంకా 70 స్ట్రక్చర్లు పూర్తికావాల్సి వుండగా ఇందులో కొన్నింటికి ఇంకా డిజైన్లు ఆమోదం రావాల్సి వుంది. అదేవిధంగా ఎడమ ప్రధాన కాలువ పరిధిలో మొత్తం 452 స్ట్రక్చర్లు నిర్మించాల్సివుంది. ఇప్పటి వరకు కేవలం 137 స్ట్రక్చర్లు మాత్రమే పూర్తయ్యాయి. 315 స్ట్రక్చర్లు పూర్తికావాల్సి వుంది. ఇందులో ఇంకా చాలా స్ట్రక్చర్లకు డిజైన్లు ఆమోదం రావాల్సి వుంది. ఇంకా కొన్ని డిజైన్లు ఆమోదానికి పంపించాల్సి వుంది. ఏదేమైప్పటికీ పోలవరం హెడ్ వర్క్సులో ప్రధానమైన కాంక్రీటు, మట్టి పనులు నిర్దేశిత లక్ష్యాల మేరకు జరుగుతున్నాయి. మిగిలిన స్ట్రక్చర్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.