ఆంధ్రప్రదేశ్‌

అమరారామం ఊసేది?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి తానెంతో సుదీర్ఘంగా ఆలోచించి అందరి మనోభావాలు గుర్తెరిగి ప్రపంచంలోనే త్వరితగతిన గుర్తింపు లభించేలా అమరావతి పేరును నామకరణం చేసానంటూ తెల్లవారుఝామున నిద్దుర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి నిద్దురపోయేవరకు.. ప్రధానంగా కేవలం పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో నిరంతరం పర్యటించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో గొప్పగా గర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. బౌద్దమతం విలసిల్లే చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో అమరావతి అతి పెద్ద బౌద్ధ క్షేత్రంగా దాని ప్రాశస్థ్యం గురించి చెబుతూ భవిష్యత్‌లో అతి పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. అయితే పంచారామాల్లో ఒకటైన అమరారామం గురించి మాత్రం దేశ, విదేశాల్లో ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పురాణాల్లోనే పంచారామాల గురించి ప్రస్తావన వుంది. అగ్రస్థానంలో అమరావతి అమరేశ్వరస్వామి ఆలయం, దాక్షారామంలో భీమేశ్వరస్వామి ఆలయం, భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లులో క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయం, సామర్లకోటలో కుమార భీమేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి. ప్రధానంగా శివరాత్రి సందర్భంగాను.. వేసవి సెలవుల్లోనూ ఆర్‌టిసి ఈ పంచారామాలను కలుపుతూ ప్రత్యేక సర్వీస్‌లను కూడా నిర్వహిస్తున్నది. అలాంటి ప్రాశస్త్యం కల్గిన అమరేశ్వరస్వామి ఆలయాన్ని నారా చంద్రబాబునాయుడు గతంలో తొమ్మిదేళ్లు సిఎంగా వున్నప్పుడు అలాగే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటూ దర్శించుకోలేదు. కనీసం రాజధానికి అమరావతి పేరు నామకరణం చేసిన తర్వాతైనా గడచిన రెండేళ్లలో నేటి వరకు ఒక్కసారైనా ఆ ఆలయంలోకి అడుగుపెట్టకపోవటంపై అసలు సిసలైన కారణాలేమిటో బహిర్గతం కావటం లేదు. పోనీ చంద్రబాబు ఆలయాలను దర్శించరా అంటే అదీ లేదు.. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఉగాది రోజున ఆయన రాజధాని ప్రాంతం అనంతవరంలో కొండపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతి గ్రామాన్ని వారసత్వ నగరంగా ప్రకటించినప్పుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకై కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో ఆ ప్రాంతానికి వెళ్లారు కాని గుడిలోకి అడుగు పెట్టలేదు. ఇక తరచూ సిఎం కార్యాలయం, నివాస గృహానికి విచ్చేసే దేశ, విదేశీ ప్రతినిధులకు చంద్రబాబు బ్రహ్మాండమైన ఆతిధ్యం ఇస్తున్నారు. ఒక్కోసారి అమరావతి మినహా ఇతర ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. అమరావతి వెళితే వారితో గుడికి వెళ్లాలనే భయం ఒక కారణమా అని ఆ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.. అమరావతి శాతవాహనరాజుల కాలంలో ఆంధ్రుల తొలి రాజధానిగా వాణిజ్య కేంద్రంగా విరాజిల్లింది. అయితే 1980లో జరిగిన కృష్ణా పుష్కరాలకు అమరావతి విచ్చేసిన నాటి సిఎం మర్రి చెన్నారెడ్డి అమరేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారని వెనువెంటనే పదవి కోల్పోవటంతో ఆపై ఏ ముఖ్యమంత్రి, ఇతర ముఖ్యులు ఆ గుడిని సందర్శించడం లేదనే ప్రచారం నేటికీ ఉంది.. రాజధాని అమరావతి గురించి గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా ఆ ఆలయాన్ని సందర్శించి ఆ ప్రచారాన్ని తిప్పికొడతారని ఆశిద్దాం.