ఆంధ్రప్రదేశ్‌

గుట్టుగా ‘సదావర్తి’ వేలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: అమరావతి దేవాలయానికి చెందిన చెన్నైలో సదావర్తి భూములను మంత్రివర్గం, గవర్నర్‌కు తెలియకుండా దేవాదాయ శాఖ ఏకపక్షంగా ఎలా వేలం వేసి విక్రయిస్తుందని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తే అసలైన దోషులు బయటకు వస్తారని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వివరించనున్నట్లు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ చెన్నై శివార్లలో ఉన్న ఈ భూముల వ్యవహారంపై తాము అధ్యయనం చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ఎలా వేలం వేస్తారన్నారు. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోవడం దారుణమన్నారు. పైగా ఈ భూముల విక్రయానికి సంబంధించి ఈ-టెండర్ల విధానాన్ని ఎందుకు అమలు చేయలేదన్నారు. హైకోర్టు అనుమతి ఎందుకు తీసుకోలేదన్నారు. ఎకరం భూమి విలువ ఏడు కోట్ల రూపాయలుంటే కేవలం రూ. 27 లక్షలకే ఎలా ఖరారు చేశారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో సదావర్తి భూముల విక్రయం పెద్ద స్కాం అన్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు.