ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు, మాల్స్ నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 9: ఆర్టీసీ ఇక నుంచి పెట్రోల్ బంక్‌లు, మాల్స్ నిర్వహించాలని, వీటితోపాటు సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో సినిమా హాళ్ళను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఏ అన్సారీ అన్నారు. ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌లో రూ.38 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్, సులాభ్ కాంప్లెక్స్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్థిక వనరులను పెంచుకోవడం, ఉద్యోగావకాశాల మెరుగు కోసం ఆర్టీసీ యాజమాన్యం ఇక నుంచి పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోందన్నారు. అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పెట్రోల్ బంక్‌ల నిర్వహణ ద్వారా ఆర్థిక ఫలితాలను సాధిస్తామన్నారు. రాష్ట్రంలో ఆయా జోన్లకు సంబంధించి ప్రయోగాత్మకంగా కొన్ని పెట్రోల్ బంక్‌లను హెచ్‌పీసీఎల్ సహకారంతో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, వాణిజ్య సముదాయాల్లో మాల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వీటితోపాటు సినిమాహాళ్ళ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తొలి దశలో తిరుమల గిరిపై ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బస్సులను కొనుగోలు చేసిన తరువాత పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టాలనే ఆలోచన ఉందని ఆయన చెప్పారు.