ఆంధ్రప్రదేశ్‌

18 నుండి 22 వరకు డీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 10: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీసెట్)లో అర్హత సాధించిన విద్యార్ధులు ఈనెల 18నుండి 22వతేదీ వరకు వెబ్ అప్షన్లను నమోదు చేసుకోవచ్చని డీసెట్ కన్వీనర్ పి పార్వతి తెలిపారు. ముందుగా ప్రకటించిన తేదీల్లో స్వల్పమార్పులు చేశామని, ఎపీ డీసెట్ వెబ్‌సైట్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాలని, 23నుండి 25వతేదీ వరకు సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. 26వతేదీన అలాట్‌మెంట్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ధృవపత్రాల పరిశీలన ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈనెల 27 నుండి 30వతేదీ వరకు జరుగుతుందని స్పష్టం చేశారు.