ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో వెయ్యి పడకల కేన్సర్ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 10: రాజధాని తుళ్లూరు- అనంతవరం మధ్యగల ఈ-7 రహదారిలో కేటాయించిన 15 ఎకరాల స్థలంలో వచ్చే ఆరునెలల కాలంలో శాటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు బసవరామతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వివరించారు. మంగళవారం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో ప్రతినిధులు సమావేశమై పలు ప్రతిపాదనలు చేశారు. శాటిలైట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్డు, విద్యుత్, నీటి వసతుల కల్పనపై చర్చించారు. హైదరాబాద్ ఆసుపత్రిలో 500 పడకల సామర్థ్యం ఉండగా రాజధానిలో వేయి పడకలతో సువిశాలమైన ఆసుపత్రి భవన నిర్మాణం చేపడతామని ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో సీఆర్డీఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ జి నాగేశ్వరరావు, డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కె నాగసుందరి, ఇన్‌ఫ్రా ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్‌విఆర్‌కె ప్రసాద్, కేపిటల్ సిటీ ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఎస్‌ఈ సీహెచ్ ధనుంజయ, అసోసియేట్ ప్లానర్ గౌరీశాంతి ఇతర అధికారులతో పాటు బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు శ్రీ్భరత్, సీఈఒ ప్రభాకరరావు, ఆర్కిటెక్ట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.