ఆంధ్రప్రదేశ్‌

నేడు సీఎం చేతుల మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 10: రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి పేదల పాలిట పెన్నిధిగా నాడు ఎన్టీఆర్ నిలిస్తే నేడు చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్‌ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ పేదల మనిషిగా నిలువబోతున్నారని పురపాలకశాఖ మంత్రి పీ నారాయణ అన్నారు. బుధవారం నుంచి అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన శుచిరుచి కల్గిన భోజనాన్ని ఐదు రూపాయలకే అందించబోతున్నామన్నారు. రాష్ట్రం మొత్తంపై 100 మున్సిపార్టీల్లో 203 క్యాంటీన్లను ప్రారంభించనుండగా తొలి విడతగా అధిక జనాభా కల్గిన 25 మున్సిపాల్టీల్లో 60 క్యాంటీన్లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని, మిగిలినవి ఆగస్టు 15వ తేదీ ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా స్థానిక విద్యాధరపురంలో నిర్మితమైన అన్ని క్యాంటీన్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ఏక రూపంలో కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఫుడ్ కోర్ట్సు మదిరిగా అదే స్థాయిలో అంతర్గత డిజైన్లు, ఇంటర్నెట్‌తో కంప్యూటర్ సదుపాయం, ఎలక్ట్రానిక్ టోకెన్ విధానం, సీసీ కెమెరాలు లబ్ధిదారుల ముఖాలు గుర్తించే పరిజ్ఞానం, టీవీలు వీటి ప్రత్యేకత. ఈ క్యాంటీన్‌లో 50 కి.మీ పరిధిలో సరఫరా చేసేలా ఆధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది. ఇక మెనూ విషయానికొస్తే ఉదయం అల్పాహారం మూడు ఇడ్లీ లేదా పూరి, 25 గ్రాము ఉప్మా, పొంగలి, మధ్యాహ్నం, రాత్రి 400 గ్రాముల అన్నం, 100 గ్రాముల కూర, 120 గ్రాముల పప్పు లేదా సాంబారు, 75 గ్రాముల పెరుగు పచ్చడి ఉంటుంది. రోజు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుండి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు భోజనం. ప్రతి ఆదివారం శెలవు దినం. ఇతర ఆరురోజుల్లో ఏదో ఒక రోజు స్పెషల్ రైస్. ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్‌ల ద్వారా అల్పాహారం, భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ స్వీకరించింది. ప్రతి రోజూ మూడుపుటలా కల్సి కనీసం 2 లక్షల, 15వేల మంది ఉంటారని ఓ ప్రాథమిక అంచనా. ఇందుకు కోసం ప్రభుత్వం రోజుకు రూ. 75 చెల్లిస్తుంది. ఇందులో లబ్ధిదారు రూ. 15 చెల్లిస్తుండగా మిగిలిన రూ. 58లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తున్నది. తద్వారా ఏడాదికి రూ. 130 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నది.
ఆహారం అద్భుతంగా ఉండాలి
అన్న క్యాంటీన్‌లలో తినేది పేదలైనా వారి మర్యాద గౌరవాలకు భంగం కలుగకుండా అద్భుతమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టామని పురపాలక సంచాలకులు కన్నబాబు తెలిపారు. మంత్రి నారాయణ సారథ్యంలో క్యాంటీన్లకు కార్పొరేట్ హంగులద్దామన్నారు. దేశంలో గొప్పగా వీటిని ఏర్పాటు చేసామన్నారు. ఎక్కడ నాణ్యత, రుచి తగ్గకుండా ఉండేలా నిత్యం ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామన్నారు.