ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు పాపాలను దేవునికి నివేదించడానికి వచ్చా: మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 10: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన పాపాలను దేవునికి నివేదించడానికి వచ్చానని, తనను మానసికంగా చంపి, రాజకీయంగా హత్య చేసిన ద్రోహి అని తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు వైకాపా, జనసేన నేతలు స్వాగతం పలికారు. బుధవారం ఆయన కాలినడకన తిరుమలకు వెళతారు. ఈసందర్భంగా ఆయన విమనాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ నమ్మినవారిని అంతం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలను తీసుకుని వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో బాబు దిగజారుడు రాజకీయాలు మరింత బహిర్గతమయ్యాయని అన్నారు. బాబు ఏపీకి పట్టిన పీడ అన్నారు. తనను నమ్మించి మానసికంగా చంపి, రాజకీయంగా హత్య చేసి దిక్కులేని వాడిని చేశారన్నారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కని వెంకన్న దర్శనానికి వచ్చానన్నారు. బాబు పాపాలను దేవుడికి విన్నవించేందుకు వచ్చానన్నారు.