ఆంధ్రప్రదేశ్‌

పోలవరం వివరాలన్నీ గడ్కరీ వెల్లడిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 10: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం, విడుదల చేస్తున్న నిధులు తదితర అంశాలన్నింటినీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడిస్తారని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. విశాఖలో తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రత్యేక దృష్టితో చూస్తోందన్నారు. ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును అనుకున్న ప్రకారం నిర్ణీత గడువు లోగా పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, నిధుల మంజూరు వంటి అంశాలపై నితిన్ గడ్కరీ ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారన్నారు. ఈ నెల 11న ఢిల్లీ నుంచి రాజమండ్రి రానున్న గడ్కరీ పోలవరం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించనున్నారన్నారు. తరువాత విశాఖ చేరుకుని పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతపై పార్టీ కార్యకర్తలకు వివరిస్తారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని పార్టీ పరంగా ఖండించాల్సి ఉందన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నాలుగేళ్ల కాలంలో నవ్యాంధ్రలో రూ.లక్ష కోట్ల మేర జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని, వీటిలో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జాతీయ రహదారి ప్రాజెక్టు పనులకు రూ.6వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు. విశాఖ విమానాశ్రయంలో పౌరవిమాన సర్వీసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నౌకాదళంతో చర్చిస్తున్నామన్నారు. నౌకాదళ విమాన శిక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రన్‌వే నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పోర్టుట్రస్టు నుంచి 34 ఎకరాల భూమిని తీసుకుని అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. బాడంగిలో రక్షణ శాఖకు చెందిన ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి పరచడం ద్వారా కొంత వెసులుబాటు ఉంటుందన్నారు.
భౌతిక దాడులు సరికాదు
ఇటీవల ఏపీలో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న భౌతిక దాడులపై హరిబాబు స్పందించారు. రాజకీయ పార్టీలేవైనప్పటికీ భౌతిక దాడులకు దిగడం సరికాదన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న విశాఖపట్నం ఎంపీ హరిబాబు