ఆంధ్రప్రదేశ్‌

తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు పదివేల మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టివి ఫణిపేర్రాజుల నాయకత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇటు ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి కాలేక అటు కనీసం ప్రైవేట్ ఉద్యోగులకు ఉండే ప్రయోజనాలు కూడా వీరికి లేకపోవటం దారుణమన్నారు. కొందరు ఉన్నతాధికారులు ఈ తాత్కాలిక ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నందున వారి వివరాలను సక్రమంగా ప్రభుత్వానికి తెలియచేయడంలో విఫలమవుతున్నారన్నారు. పోలీస్‌శాఖలో దాదాపు 20 నుంచి 25 ఏళ్లకుపైగా పని చేస్తున్న కానిస్టేబుళ్లు పదోన్నతులకు నోచుకోక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. ఈ ప్రత్యేక బృందంలో పోలీస్ అధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.శ్రీనివాసరావు, జేఏసీ కృష్ణా అధ్యక్షులు డి.ఈశ్వర్, కార్మికశాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్, అమరావతి శాఖ అధ్యక్షులు కళాధర్ ఉన్నారు.