ఆంధ్రప్రదేశ్‌

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 14: రాజధాని ప్రాంతంలో ప్రతిపాదించిన అంతరవలయ రహదారి (ఇన్నర్ రింగురోడ్డు) ముసాయిదా ప్రణాళిక అలైన్‌మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు ముసాయిదా ప్రణాళికపై గతంలో రైతుల నుంచి అభ్యంతరాలు, సూచనలను సీఆర్డీఏ అధికారులు సేకరించారు. దీనిపై వాదనలు వినేందుకు శనివారం హియరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం, జి కొండూరు, గన్నవరం, పెనమలూరు మండలాలకు చెందిన 14 గ్రామాల రైతులతో విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో రెండు విడతలుగా అధికారులు సమావేశమయ్యారు. తమ ప్రాంతానికి అలైన్‌మెంట్ మార్చాలని, సమీపంలో 300 అడుగుల దూరంలో ఉన్న 200 అడుగుల జెడ్పీ రోడ్డుకు అనుసంధానంగా ఐఆర్‌ఆర్ ఏర్పాటు చేయాలని, తాము భూములిచ్చే ప్రసక్తిలేదని పెనమలూరు రైతులు తేల్చిచెప్పారు. రాజధాని తరహాలో ప్యాకేజీ ఇస్తారా.. ఏ రకంగా భూసేకరణ జరుపుతారో స్పష్టం చేస్తే భూములిచ్చే విషయమై ఆలోచన జరుపుతామని మరికొందరు రైతులు వాదించారు. ఐఆర్‌ఆర్‌కు ఎంత భూమిని సేకరిస్తారో అంతే భూమిని తమకు సమీపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరు, కేతనకొండ, కొండపల్లి, నవీపోతవరం, త్రిలోచనాపురం, జీ కొండూరు మండలానికి చెందిన కవులూరు, గన్నవరం మండలానికి చెందిన రామచంద్రాపురం, సూరంపల్లి, వెదురుపావులూరు, పెనమలూరు మండలం చోడవరం, గంగూరు, కానూరు, పోరంకి, పెనమలూరు గ్రామాల రైతులతో పాటు సీఆర్‌డీఏ, ఎన్‌హెచ్‌ఏఐ, కృష్ణా, గుంటూరు జిల్లాల ఆర్ అండ్ బి అధికారులు సమావేశానికి హాజరయ్యారు.