ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్ రద్దుకు ఇక దేశవ్యాప్త ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: భారతదేశ వ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానం రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్లతో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఇఎఫ్) ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఏఐఎస్‌జిఇఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏ శ్రీకుమార్ తెలిపారు. విజయవాడలో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన శనివారం మధ్యాహ్నం గాంధీనగర్ ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2004లో 27 రాష్ట్రాల్లో వర్తింపజేసిన సీపీఎస్ రద్దు కోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. సీపీఎస్ విధానం ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
దేశ వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఈ రెండు డిమాండ్లే అజెండాగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పై రెండు డిమాండ్ల సాధనకై నవంబర్ 15న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు రోజులపాటు జరుగుతున్న సమావేశంలో అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఒరిస్సా, రాజస్థాన్, తెలంగాణా, తమిళనాడు, త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల ప్రతినిధులు దాదాపు 80 మంది పాల్గొన్నట్లు తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు పీ అశోక్‌బాబు మాట్లాడుతూ 27 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, దేశ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరరించాలని డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో ఏఐఎస్‌జిఇఎఫ్ చైర్మన్ సుభాష్ లంబా, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఏఐఎస్‌జిఇఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.